Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015లో పెళ్లి... భర్తతో 45 రోజులే కలిసుంది... అతడిని రప్పించండి...

మనుషులు ఇలా ఎందుకు వుంటారో ఒక పట్టాన అర్థం కాదు. పెళ్లి చేసుకుని కొందరు తమ భార్యలను వదిలేసి విదేశాల్లో కాలం గడుపుతారు. అదేమని అడిగితే సరైన ఆన్సర్ దొరకదు. ఇక వాడి బుద్ధి పక్కదోవ పడితే ఇక చెప్పేదేముంది. పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు అన్నీ కష్టాలే. ఇలాంటి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (18:19 IST)
మనుషులు ఇలా ఎందుకు వుంటారో ఒక పట్టాన అర్థం కాదు. పెళ్లి చేసుకుని కొందరు తమ భార్యలను వదిలేసి విదేశాల్లో కాలం గడుపుతారు. అదేమని అడిగితే సరైన ఆన్సర్ దొరకదు. ఇక వాడి బుద్ధి పక్కదోవ పడితే ఇక చెప్పేదేముంది. పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు అన్నీ కష్టాలే. ఇలాంటి కష్టాలను పడుతున్న ఓ పంజాబీ అమ్మాయి తన భర్తను కఠినంగా శిక్షించాలంటూ నేరుగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ను అభ్యర్థించారు. తనను వదిలేసి న్యూజీలాండ్ దేశంలోనే వుంటున్న అతడిని భారతదేశానికి రప్పించి మరో మగాడు ఇలా చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతోంది.
 
సామాజిక నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తన బాధను ఆమె వెల్లడించారు. తన భర్త రమణ్ దీప్ నేరాలు చేయడంలో ఆరితేరిపోయాడని పంజాబ్ పోలీసు రికార్డుల్లోనే వుందనీ, అలాంటి వాడిని వదిలేయకుండా శిక్షించాలని ఆమె కోరారు. 29 ఏళ్ల చాంద్ దీప్ 2015 జూలై నెలలో అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిపింది. అక్కడ నుంచి అతడు కొన్ని రోజులు ఇక్కడ వుంటూ మిగిలిన రోజులన్నీ న్యూజిలాండులో వుంటూ వచ్చాడని పేర్కొంది. ఇన్నేళ్లలో తను అతడితో కేవలం 45 రోజులు మాత్రమే కలిసి వున్నాననీ, అతడిని ఇండియాకు రప్పించి విడాకులు ఇప్పిస్తే కొత్త జీవితం మొదలుపెడతానని తెలియజేసింది. 
 
ఇప్పటికే తన అభ్యర్థన మేరకు అతడికి చెందిన పత్రాలను విదేశీ మంత్రిత్వ శాఖ పంపించాల్సిందిగా కోరిందనీ, అతడిని ఎలాగైనా రప్పించి, అలా ప్రవర్తించే మగాళ్లకు బుద్ధి వచ్చేలా శిక్ష విధించాలని ఆమె కోరుతోంది. భర్త పరిస్థితి ఇలావుంటే తన అత్తమామలు కూడా తనపై దారుణంగా ప్రవర్తిస్తున్నారనీ, తమ కుమారుడిని తాము వదిలేశామనీ, కనుక నన్ను అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి బతకాల్సిందిగా చెపుతున్నారని వెల్లడించింది. ఈమధ్య తను తరచూ ఫోన్లు చేస్తున్నానని వారి ఫోన్లో తన నెంబరును బ్లాక్ చేసేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments