పెద్ద నోట్ల రద్దుతో నిద్రకరువైన మాజీ మంత్రి... పరువు బజారుకీడుస్తున్నారంటూ ఫిర్యాదు

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఓ మాజీ మంత్రికి నిద్రకరువైంది. దీంతో ఆయన తన బజారుకీడుస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (15:25 IST)
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఓ మాజీ మంత్రికి నిద్రకరువైంది. దీంతో ఆయన తన బజారుకీడుస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మాజీ మంత్రి పేరు ఏఎల్ హెక్. మేఘాలయా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. గతంలో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా పని చేశారు. ఇంతకూ ఆయనకు నిద్రాభంగం కావడానికి కారణమేంటో ఓ సారి పరిశీలిద్ధాం.
 
పెద్ద నోట్ల రద్దుతో ఆయన దగ్గరున్న నల్లధనాన్ని తన నియోజకవర్గ ప్రజలందరికీ తలా రూ.5000 పంచిపెడుతున్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇవి ఆనోటా ఈనోటా పడి చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా పాకడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి రావడం మొదలెట్టారు. జనాల తాకిడి పెరగడం, కొందరు రాత్రిపూట కూడా వచ్చి తలుపు తడుతుండటంతో సదరు మాజీ మంత్రికి నిద్ర కూడా కరువైంది. 
 
దీంతో ఆయన తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌కెళ్లి కేసు పెట్టారు. షిల్లాంగ్ అంతటా తనపై పుకార్లు సృష్టించిన వారిని కనిపెట్టాలని వేడుకున్నారు. 'నేను డబ్బులు పంచిపెడుతున్నానని భావించి వందలాది జనం మా ఇంటికి వస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎవరు పంపారని వారిని అడిగితే ఎవరెవరివో పేర్లు చెబుతున్నారు.. తీరా వారిని అడిగితే తమకు మరెవరో చెప్పారని నాలిక్కరుచుకుంటున్నారు. ఈ పుకార్లు సృష్టిస్తున్నదెవరో తెలియదుగానీ.. వీటి కారణంగా నా పరువు బజారుకీడ్చినట్టయింది' అని హెక్ వాపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments