Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఇంటిని కూల్చివేస్తే దేశంలో హింస ఆగిపోతుంది : ఆప్ నేతలు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (08:51 IST)
దేశ రాజధానిలోని ఉత్తర ఢిల్లీలో జహంగీర్‌పురి ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ చర్యను ఢిల్లీ ఆప్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రతిఘటిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితికి కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఆప్ నేత ఆతిషి ఆరోపించారు. 
 
దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింస ఆగాలంటే తొలుత కూల్చాల్సింది హోం మంత్రి అమిత్ షా ఇల్లు అని వ్యాఖ్యానించారు. హోం మంత్రి అమిత్ షా ఇంటిని కూల్చివేస్తే దేశంలో ఘర్షణలకు శాశ్వత ముగింపు లభిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి, హనుమంతుడి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణల వెను అమిత్ షాతో పాటు.. బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే, ఈ ఆక్రమణల కూల్చివేతపై మరో ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ, బుల్డోజర్లతో ఇళ్లు కూల్చాల్సివస్తే తొలుత కూల్చాల్సింది అమిత్ షా ఇంటినే అని ప్రకటించారు. అది జరిగితే తప్ప దేశంలో ఘర్షణలు ఆగబోవన్నారు. ఢిల్లీలో నేటి పరిస్థితికి బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఢిల్లీని 15 యేళ్ల పాలించిన బీజేపీ ఆ సమయంలో లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని ఆరోపించారు. ఇపుడు వాటిని ఆక్రమణల పేరుతో తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments