Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్‌బీ పరిచయం.. నగ్నంగా వీడియో పంపి.. రూ.51వేలు పంపాలని డిమాండ్.. చివరికి?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:11 IST)
ఢిల్లీ యువకుడిని సోషల్ మీడియా ద్వారా ఓ యువతి టార్గెట్ చేసింది. ఢిల్లీలోని నలసోపారా ఏరియాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తిని ఆ యువతి ముంచేసింది. వివరాల్లోకి వెళితే.. నలసోపారాకు చెందిన 24 ఏళ్ల యువకుడు గౌరవ్... గౌరవంగా తన పని తాను చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ యువతి అతన్ని టార్గెట్ చేసింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు అతని మొబైల్ ట్రింగ్ మంది. ఏదో మెసేజ్ అనుకొని ఓపెన్ చేశాడు. 
 
ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్. ఎవరో అందమైన అమ్మాయి ఆ రిక్వెస్ట్ పంపింది. వెంటనే ఓకే చేసేశాడు. ఆ తర్వాత అతనితో చాటింగ్ మొదలుపెట్టింది. పరిచయాలు, పలకరింపులూ మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే బాగా దగ్గరైపోయింది. వాట్సాప్ నంబర్ అడిగింది. ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ మొదలైంది. మెల్లగా వీడియో చాట్ మొదలుపెట్టింది. ఫొటోల్లో కంటే... వీడియోలో ఇంకా అందంగా ఉందే అని అనుకున్నాడు.
 
ఓ రోజు రాత్రి వేళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. నిద్రపోవడం మానేసి... ఆమెతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. రెండ్రోజలు తర్వాత అతని వాట్సాప్ నంబర్‌కి అతని నగ్న వీడియోని పంపింది. తనకు రూ.51,00,000 పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆ వీడియోని అతని ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు, ఆఫీసులో ఉద్యోగులు అందరికీ పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. 
 
షాకైన అతను వెంటనే తులింజ్ పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. మార్చి 6, మార్చి 8న తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పాడు. ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సైబర్ సెల్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం