హస్తినలో అన్‌లాక్.. దశల వారీగా అమలు : సీఎం కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:08 IST)
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీలో మొదటిసారి ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇపుడు ఈ నెల 31వ తేదీ నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కరోనా వైరస్ దెబ్బకు తల్లడిల్లిపోయిన ఢిల్లీ... ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ కారణంగా క్రమంగా కోలుకుంది. ఇపుడు అన్‌లాక్ ప్రక్రియను షూరూ చేయనున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు. 
 
అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఉత్పాదక యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు అనుమతిస్తామని.. అలాగే కనస్ట్రక్షన్ వర్కర్లకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు సీఎం కేజ్రివాల్ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, "చాలా సమస్యలను ఎదుర్కొన్న తర్వాత.. సెకండ్ వేవ్‌పై నియంత్రణ సాధించాం. అంటే దీని అర్థం కరోనాపై పోరాటం ముగిసినట్టు కాదు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 1.5 శాతం వద్ద ఉంది’ అని తెలిపారు. 
 
అన్‌లాక్ ప్రక్రియలో ముందుగా అట్టడుగు వర్గాలవారిని దృష్టిలో ఉంచుకోవాలని, వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అన్నారు. రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీలను తెరవడంతో పాటుగా, నిర్మాణ కార్యాకలాపాలను అనుమతించాలని నిర్ణయించినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments