Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆడశిశువు పుట్టింది.. నిందితుడిపై పోక్సో చట్టం

Delhi
Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (12:56 IST)
60 ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అక్టోబర్ 31న ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిది నెలల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నార్త్ ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోంది. ఇద్దరూ పని మనషులుగా కొనసాగుతూ జీవనం కొనసాగిస్తున్నారు. 
 
అయితే ఈ బాలికకు తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ షాప్ కీపర్‌(60) పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం బాలికపై షాప్ కీపర్‌ అత్యాచారం చేశాడు. మొత్తానికి బాధితురాలు గర్భం దాల్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 31న ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బిడ్డను బట్టలో చుట్టి.. స్థానికంగా ఉన్న ఓ షాపు వద్ద విడిచిపెట్టి వెళ్లింది.
 
శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. శిశువును వదిలిపెట్టి వెళ్లిన బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
 
ఆ బాలికను పోలీసులు విచారించగా.. తొమ్మిది నెలల క్రితం షాప్ కీపర్ తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత గర్భం దాల్చినట్లు బాధితురాలు చెప్పింది. దీంతో షాప్ కీపర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments