Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే ఆధ్యాత్మిక వర్శిటీ.. బాలికలతో వ్యభిచారం... ఇదీ రోహిణి ఆశ్రమం గుట్టు

ఢిల్లీలోని రోహిణి ఆశ్రమం లోపల జరుగుతున్న గుట్టురట్టయింది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పేరుతో ఆశ్రమం లోపల గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తూ వచ్చిన వ్యభిచార గుట్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో రట్టయింది.

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (13:36 IST)
ఢిల్లీలోని రోహిణి ఆశ్రమం లోపల జరుగుతున్న గుట్టురట్టయింది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పేరుతో ఆశ్రమం లోపల గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తూ వచ్చిన వ్యభిచార గుట్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో రట్టయింది. ఈ ఆశ్రమం నుంచి పదుల సంఖ్యలో బాలికలకు విముక్తి కల్పించారు. ముఖ్యంగా అనేక మంది అమ్మాయిలను ఇరుకు గదుల్లో ఇరికించగా, వారందరినీ పోలీసులు విడిపించారు. 
 
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గత 25 ఏళ్లుగా విజయ్ విహార్ పేరుతో వీరేంద్ర దీక్షిత్‌పై అనే వ్యక్తి ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. దీన్ని ఇటీవల ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా మార్చారు కూడా. ఆయన 16 వేల గోపికలను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా.. అమ్మాయిల తల్లిదండ్రులతో బలవంతంగా సంతకాలు చేయించుకొంటూ వారిని ఆశ్రమాల్లో ఉంచుకునేవారు. వీరందరినీ చిన్నచిన్నగదుల్లో కుక్కి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ తరహా ఆరోపణలు 1996 నుంచి ఉన్నాయి. 
 
దీనిపై ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీవో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు గీతా మిట్టల్, హరి శంకర్‌లు విచారణ జరిపి ఆశ్రమంలో సోదాలకు పోలీసులను ఆదేశించారు. దీంతో రోహిణి ప్రాంతంలోని వీరేంద్ర ఆశ్రమాలపై శుక్రవారం నుంచి పోలీసులు దాడులు చేశారు. గుర్మీత్ రామ్ రహీమ్ రాయించుకున్నట్టుగానే, వీరేంద్ర సైతం తన భక్తుల నుంచి పలు రకాల అఫిడవిట్లు రాయించుకున్నాడని, వందల కోట్ల విలువైన ఆస్తులను తన పేరిట బదలాయించుకున్నట్టు విచారణలో తేలింది. 
 
ఆశ్రమం లోపల మెటల్ డోర్లు, గదులు, వాడేసిన సిరంజిలు లభించాయని, వందల మంది మహిళలను ఇరుకు గదుల్లో కుక్కి, వారితో వీరేంద్ర వ్యభిచారం చేయిస్తుండేవాడని తేలింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ, తనకు తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుని ముక్కు పచ్చలారని అమ్మాయిలను నిర్బంధించి, వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించిన వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై సోదాలు జరిగినట్టు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా, 'ఆథ్మాత్మిక విశ్వ విద్యాలయం' పేరిట ఓ పెద్ద సెక్స్ రాకెట్‌ను వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్నాడని, బయటి నుంచి వచ్చేవారి వద్దకు అమ్మాయిలను పంపేవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం