Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Railway Station Tragedy: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం ఏంటంటే?

సెల్వి
శనివారం, 2 ఆగస్టు 2025 (11:56 IST)
Delhi Railway Station
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం బయటపడింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు ప్యాసింజర్ తలపై మోస్తున్న పెద్ద బ్యాగ్ కిందపడటమే ప్రధాన కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. 
 
ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. మహా కుంభమేళా కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో, ఫిబ్రవరి 15న రాత్రి 8:48 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి-3పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లను కలుపుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ తలలపై భారీ లగేజీని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో, ఒక ప్రయాణికుడు తలపై మోస్తున్న ఒక పెద్ద బ్యాగ్ జారి కిందపడింది. 
 
దీంతో పై మెట్లపై ఉన్న ప్రయాణికులు కింది మెట్లపై ఉన్న వారిని నెట్టుకున్నారు. ఇది డొమినో ప్రభావంలా పనిచేసి, మెట్లపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments