ఢిల్లీలో భారీ ఉగ్రవాద దాడికి ఉగ్రవాదుల ప్లాన్, పోలీసులకు హెచ్చరికలు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:02 IST)
ఢిల్లీ పోలీసులకు జూలై 20న నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. డ్రోన్ల సహాయంతో దేశ రాజధానిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వున్నట్లు సమాచారం ఇచ్చారు. 

ఆగస్టు 15 లోపు ఉగ్రవాదులు ఈ దాడిని అమలు చేయవచ్చని వార్తా సంస్థ ఎఎన్ఐ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థితిని కోల్పోయి, ఆర్టికల్ 370ను ఆగస్టు 5, 2019 న రద్దు చేసినందున, ఉగ్రవాద దాడి దాని వార్షికోత్సవం సందర్భంగా అమలు చేయాలని ఉగ్రవాదులున్నట్లు తెలిపారు.
 
ఢిల్లీలో ‘ఆపరేషన్ జిహాద్’ ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని ఎబిపి వార్తలు తెలిపాయి. అంతేకాకుండా, ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టయిన ఇద్దరు అల్-ఖైదా ఉగ్రవాదులు ఆగస్టు 15కి ముందు ఢిల్లీలో ఉగ్రవాదులు పెద్ద ఉగ్రవాద దాడికి యోచిస్తున్నట్లు అంగీకరించారు.
 
ఇదిలావుంటే సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ శిక్షణతో సహా యుఎవి (మానవరహిత వైమానిక వాహనం) దాడులను ఎదుర్కోవటానికి ఢిల్లీ పోలీసులకు మరియు ఇతర భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. అదనంగా, భారత వైమానిక దళం ప్రత్యేక డ్రోన్ నియంత్రణ రూంని ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థల సంఖ్యను కూడా నాలుగుకు పెంపుదల చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments