Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్‌సైట్‌లో ఎయిర్‌హోస్టెస్ ప్రొఫైల్.. డేటింగ్‌కు వస్తావా అంటూ ఫోన్లు...

తాను పెళ్లి చేసుకోబోయే యువతి ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీన్ని చూసిన పలువురు యువకులు ఆమె నంబరుకు ఫోన్ చేసి డేటింగ్‌కు వస్తావా అంటూ వేధించసాగారు. దీంతో ఖంగుతిన్న బాధిత యువతి పోలీసులను ఆశ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:48 IST)
తాను పెళ్లి చేసుకోబోయే యువతి ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీన్ని చూసిన పలువురు యువకులు ఆమె నంబరుకు ఫోన్ చేసి డేటింగ్‌కు వస్తావా అంటూ వేధించసాగారు. దీంతో ఖంగుతిన్న బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇంజనీర్ అయిన కాబోయే వరుడుని పోలీసులు అరెస్టు చేశారు.
 
ఢిల్లీ నగరంలోని వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఆమె పెళ్లి చేసుకునేందుకు తన ప్రొఫైల్‌ను వివాహ వెబ్‌సైట్‌లో పెట్టగా మిలటరీ ఇంజినీర్ సర్వీస్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడితో వివాహం కుదిరింది. రెండు కుటుంబాల పెద్దలు వీరికి వివాహ నిశ్చితార్థం కార్యక్రమం చేసుకోవాలనుకున్నారు. 
 
అంతలో కాబోయే వరుడే వధువు అయిన ఎయిర్ హోస్టెస్ ఫోటోతో ప్రొఫైల్‌ను పోర్న్‌వెబ్ సైట్‌లో పెట్టాడు. ఈ ప్రొఫైల్‌ను చూసిన పలువురు అపరిచితులు డేటింగ్‌కు వస్తావా అంటూ ఎయిర్ హోస్టెస్‌కు ఫోన్లు చేశారు. తన ప్రొఫైల్‌ను పోర్న్ సైట్‌లో పెట్టారని తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్ షాక్ తింది. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఎయిర్ హోస్టెస్‌తో నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడే ఆమె ప్రొఫైల్‌ను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టాడని తేలింది. పెళ్లి చేసుకోకుండా ఎయిర్ హోస్టెస్‌తో డేటింగ్ చేసేందుకు యువకుడు ఇలా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మిలటరీ ఇంజినీరు అయిన యువకుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం