Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారికిరాకుంటే యాసిడ్ పోస్తా.. నీ కుమార్తెను చంపేస్తా.. ఐఏఎస్‌కు బెదిరింపులు

ఆమె ఓ ఐఏఎస్. జిల్లా కలెక్టర్‌గా పని చేసింది. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినా కూడా ఏమాత్రం బెరుకులేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్య

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (10:42 IST)
ఆమె ఓ ఐఏఎస్. జిల్లా కలెక్టర్‌గా పని చేసింది. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినా కూడా ఏమాత్రం బెరుకులేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించసాగాడు. అసభ్యకర మెసేజ్‌లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఇక వేధింపులు తట్టుకోలేని ఆ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్‌కు కార్యదర్శిగా సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి పని చేస్తోంది. గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్‌లోని ఓ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి బదిలీ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments