Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపేశాడు.. శవంపై పరుపు పేర్చి.. ప్రేయసితో ఉల్లాసంగా గడిపాడు!

భార్యను చంపేశాడు.. ఆమె మృతదేహాన్ని మంచం కింద ఉంచాడు. దానిపైనే పరుపు వేశాడు. ప్రేయసితో ఉల్లాసంగా గడిపాడు. దుర్గంధం వచ్చేసరికి గోనెసంచిలో భార్య మృతదేహాన్ని రోడ్డుపై పారేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (17:48 IST)
భార్యను చంపేశాడు.. ఆమె మృతదేహాన్ని మంచం కింద ఉంచాడు. దానిపైనే పరుపు వేశాడు. ప్రేయసితో ఉల్లాసంగా గడిపాడు. దుర్గంధం వచ్చేసరికి గోనెసంచిలో భార్య మృతదేహాన్ని రోడ్డుపై పారేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఢిల్లీలోని షగార్‌పూర్‌లో చోటుచేసుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా ఢిల్లీ షగార్‌పూర్ రోడ్డుకు సమీపంలో ఓ గోనె సంచి నుంచి దుర్గంధం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో ఆ మృతదేహం హలీమాదని తేలింది. ఆపై పోలీసులు జరిపిన విచారణలో హలీమాను ఆమె భర్త ఫెరోజ్ ఖాన్ హత్య చేసినట్లు తేలింది. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు తన వాంగ్మూలంలో జరిగిందేంటో చెప్పేశాడు.
 
తన భార్య హలీమాతో మనస్పర్ధలు ఏర్పడటంతో విడిపోయామని.. ఆపై పూజ అనే అమ్మాయితో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పాడు. పూజతో సహజీవనం చేయడం తన భార్యకు నచ్చలేదని, ఈ వ్యవహరంపై ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవని చెప్పుకొచ్చాడు. హలీమా తరచూ తగాదాకు దిగడంతో ఆమెను చంపేసినట్లు ఫెరోజ్ చెప్పాడు. ఇందుకు పూజ కూడా సహకరించిందని వెల్లడించాడు. 
 
హలీమాను చంపేసిన తర్వాత మృతదేహాన్ని బాక్సులో పెట్టి మంచం కింద పెట్టామని.. దానిపై పరుపు పేర్చి.. రెండు రోజుల పాటు తాను పూజ నిద్రించామని చెప్పాడు. ఇక పూజ మృతదేహం నుంచి దుర్గంధం రావడంతో దాన్ని రోడ్డుపై విసిరేసినట్లు ఫెరోజ్ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments