Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:22 IST)
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను మద్యం కుంభకోణం కుదిపేసింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైదరాబాద్, నెల్లూరులతో పాటు ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20కు పైగా ప్రాంతాల్లోను, ఏపీలోని నెల్లూరు, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 20 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. 
 
కాగా, ఈ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అపుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ అధికారులు రెండో దఫాలో మాత్రం ఈ తనిఖీలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments