Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు- కవితకు ఈడీ నోటీసులు

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (10:07 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ బిజినెస్ మేన్ అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. 
 
ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవిత బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments