Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రెడ్‌‌లైట్ ఏరియాలో కండోమ్స్ కొరత... కండోమ్స్ కోసం విటుల వెంపర్లాట!

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (19:38 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కండోమ్స్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివశించే ప్రాంతంలోజీబీ రోడ్స్‌లో ఈ పరిస్థితి నెలకొనివుంది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రభుత్వం తక్షణం 4 లక్షల కండోమ్స్ సరఫరా చేయాల్సిందిగా సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ సంస్థకు తక్షణ ఆదేశాలు జారీచేసింది. 
 
ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియాలా ఢిల్లీలో కూడా జీబీ రోడ్స్ సెక్స్ వర్కర్లకు పెట్టింది పేరు. ఈ సెక్స్ వర్కర్ల వద్దకు వచ్చే విటుల కోసం ఢిల్లీ ప్రభుత్వం లక్షల సంఖ్యలో కండోమ్స్‌ను సరఫరా చేస్తోంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతానికి ప్రతి నెలా 12 లక్షల కండోమ్స్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీటి సరఫరా నిలిచిపోగా మే నెలలో 24 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. అప్పటి నుంచి కండోమ్స్ కొరత ఏర్పడంతో సెక్స్‌వర్కర్లతో పాటు విటులు ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
 
ఈ రోడ్‌లో కండోమ్స్ కొరత కారణంగా సుమారు ఐదు వేల మంది మహిళలు, వందల సంఖ్యలో మగవాళ్లు ఎయిడ్స్ బారిన పడినట్లు నివేదిక అందించారు. ఇదే అంశంపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఓ నివేదికను సమర్పించగా, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ స్పందించారు. ఈ ఏరియాకు తక్షణం 4 లక్షల కండోమ్స్ సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. తగినంత స్టాక్ లేకపోతే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?