Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (14:40 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. దీంతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ తరపున అల్కా లాంబా, బీజేపీ నేత రమేశ్ బిధూరి ఎన్నికల బరిలోకి దిగారు. 
 
కాగా, తన ఆస్తుల విలువ రూ.76,93,347గా అతిశీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని తెలిపారు. తనకు కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందన్నారు. తనకు సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు. రెండు పరువునష్టం కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. అయితే, గత 2020లో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అతిశీ ఆస్తులు రూ.17 లక్షలుగా ఉంటే ఇపుడు ఈ ఆస్తులు రూ.76 లక్షలకు పెరగడం గమనార్హం. 
 
అల్కా లాంబా తనకు రూ.3.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fahadh Faasil: ఏడీహెచ్డీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫహద్ ఫాసిల్

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. జూ.ఎన్టీఆర్ షాక్

దర్శకుడు శంకర్ సినిమాల ఫెయిల్యూర్‌‍కు కారణం ఆవిడేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ కలెక్షన్లు కుమ్మేస్తున్నారు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు... ఆస్పత్రిలో అడ్మిట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments