Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆప్‌కు తగ్గిన 10 శాతం ఓట్లు.. కోల్పోయిన సీట్లు 40

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టనుంది. మరోవైపు, గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోయి కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలకు షేర్ అయిన ఓట్లను పరిశీలిస్తే.. బీజేపీకి ఏడు శాతం ఓట్లు పెరిగాయి. ఆప్‌కు పది శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ఆ పార్టీ కొంప ముంచాయి. ఓట్ల శాతం తగ్గిపోవడంతో ఆప్‌కు 401 సీట్లు తగ్గి  బీజేపీకి పెరిగాయి. ఫలితంగా కమలనాథులు 23 యేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. 
 
గత 2015, 2020, 2025 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఎన్నికల్లో బీజేపీకి 45.76 శాతం ఓట్లు పోలుకాగా, కాంగ్రెస్ పార్టీకి కేవం 6.36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఆ పార్టీకి పది శాతం ఓట్లు తగ్గాయి. 
 
2020 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.51 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఏడు శాతానికి పైగా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో ఏకంగా 53.57 శాతం ఓట్లను దక్కించుకోగా, ప్రస్తుతం ఆ పార్టీ పది శాతం ఓటు బ్యాంకును కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో 4.26 శాతంగా ఉండగా, ఇపుడది 6.36 శాతానికి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments