Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరిని ఏడిపించారు.. కత్తితో దాడి చేశారని.. మైనర్ ఆ ఇద్దరిని చంపేశాడు..

సోదరిని ఏడిపించి.. కత్తితో దాడికి పాల్పడిన వారిపై ఢిల్లీకి చెందిన మైనర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం కోసం రెండు హత్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సునీల్, కులదీప్ అనే ఇద్దరు యువకులు ప

Webdunia
గురువారం, 18 మే 2017 (14:38 IST)
సోదరిని ఏడిపించి.. కత్తితో దాడికి పాల్పడిన వారిపై ఢిల్లీకి చెందిన మైనర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం కోసం రెండు హత్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సునీల్, కులదీప్ అనే ఇద్దరు యువకులు ప్రస్తుతం హత్యకు పాల్పడిన మైనర్‌తో తరచూ గొడవపడుతుండేవారు. ఓసారి మైనర్ సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అతడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనకు అనంతరం సునీల్ అనే వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఆపై పెరోల్‌లో సునీల్ బయటికి వచ్చాడు. 
 
పెరోల్‌లో బయటికి రావడాన్ని తట్టుకోలేని మైనర్ తన స్నేహితుడు మనోజ్‌ను తన వెంటబెట్టుకుని ఖ్యాలా ప్రాంతానికి వెళ్లాడు. అతడితో ఏదో మాట్లాడాలని ఓ పార్క్‌కు పిలిచి ఓ ఐదు నిమిషాల తర్వాత నాలుగుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. అయితే మనోజ్ తల్లిదండ్రుల నుంచి ఫోన్ రావడంతో మైనర్‌ను వదిలి వెళ్ళిపోయాడు. కానీ మైనర్ అంతటితో ఆగకుండా కులదీప్ వద్దకు వెళ్లాడు. 
 
రాత్రి 11గంటల ప్రాంతంలో అతడిని బయటకు పిలిచి ఏకంగా 20సార్లు అదే కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోగా తొలుత మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి సహాయంతో మైనర్‌ను అరెస్టు చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇక ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ ఇద్దరిని తాను హతమార్చినట్లు మైనర్ అంగీకరించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments