Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న అతిపెద్ద రాష్ట్రానికి సీఎం.. చెల్లేమో టీ విక్రయిస్తోంది.. ఎక్కడ?

అన్న అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతని చెల్లెలు మాత్రం ఓ మారుమూల గ్రామంలో టీ కొట్టుపెట్టుకుని తమ కుటుంబాన్ని భారాన్ని మోస్తోంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి, ఆ చెల్లెలు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (08:58 IST)
అన్న అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతని చెల్లెలు మాత్రం ఓ మారుమూల గ్రామంలో టీ కొట్టుపెట్టుకుని తమ కుటుంబాన్ని భారాన్ని మోస్తోంది. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి, ఆ చెల్లెలు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అతని చెల్లెలు శశిపాయల్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కోఠార్ అనే గ్రామంలో చిన్నపాటి టీ దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. 
 
తన అన్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడనే భావన ఆమెకు ఏమాత్రం లేదు. పైగా, ఆయన వద్దకు వెళ్లి ఏదేనా సాయం పొందాలన్న ఆలోచన అస్సలు లేదు. వారిని చూసి ఇరుగుపొరుగువారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ప్రస్తుత సీఎం యోగి... అంతకుముందున్న సీఎం అఖిలేష్ పాలనల మధ్య తేడాలను జనం బేరీజు వేస్తున్నారు. 
 
కాగా యోగి తన రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులకు ఏమాత్రం స్థానం కల్పించలేదు. యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిపాయల్ ఈరోజుకీ ఉత్తరాఖండ్‌లోని కోఠార్ గ్రామంలో చిన్న దుకాణంలో టీ విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకరావడమే ఇందుకు నిదర్శనం. 
 
గ్రామంలోని పార్వతి మందిరం సమీపంలో తన భర్త పూరన్‌సింగ్‌తో పాటు ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో పూజా సామగ్రి కూడా విక్రయిస్తుంటారు. ఆమె తన సోదరుడు యోగిని 2017 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. 
 
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శశిపాయల్ మాట్లాడుతూ 'నా సోదరులందరి స్వభావం వైవిధ్యంగా ఉంటుంది. మా నాన్నే అందరినీ కష్టపడిపెంచారు. అయితే యోగి పెద్దయ్యాక అందరికీ సేవ చేస్తానని చెప్పేవాడు. అప్పుడు ఆ మాటను తేలికగా తీసుకున్నాం. ఇప్పుడు అది నిజమైంది. అయితే తాను యోగికి రాఖీ కట్టి 23 ఏళ్లు అయ్యిందని' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments