Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెరె.. పెన్షన్ల కోసం భర్తలను చంపేస్తున్నారట.. ఎక్కడ?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (18:08 IST)
అవును.. పెన్షన్ల కోసం ఉత్తరప్రదేశ్‌లో మహిళలు భర్తలను చంపేస్తున్నారట. ఎలాగంటే..? యూపీలో భర్త ప్రాణాలతో వుండగానే కొందరు మహిళలు వితంతువులకు ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నారు. భర్తలను కోల్పోయిన వితంతువులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భర్త ప్రాణాలతో వున్నప్పటికీ.. ఆయన మరణించినట్లు చెప్పి.. పెన్షన్లు తీసుకునే మహిళల సంఖ్య పెరిగిపోయిందని తేలింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, సీతాపూర్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ సతీమణి సెల్‌ఫోన్‌కు.. ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆమె అకౌంట్‌కు మూడు వేల రూపాయలు జమచేసినట్లు వుంది. ఈ మూడు వేలు ఎలా వచ్చిందని ఆరా తీసిన సందీప్ కుమార్.. దీనిపై బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇది వితంతువులకు ఇచ్చే పెన్షన్ డబ్బు అని వారు వివరణ ఇవ్వడంతో షాక్ తిన్నాడు.
 
భర్త తాను ప్రాణాలతో వుండగా వితంతు పెన్షన్ ఎలా వచ్చిందని భార్యను నిలదీశాడు. తర్వాతే తెలిసింది.. సందీప్ భార్యే కాకుండా.. ఆ గ్రామానికి చెందిన 22 మంది మహిళలు.. భర్తలు బతికి వున్నప్పటికీ.. చనిపోయాడని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి.. పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments