కుప్పలు తెప్పలుగా మృతి చెందిన గబ్బిలాలు.. కరోనా అని జడుసుకున్న?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:30 IST)
Bats
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కలు, కాకులు, గబ్బిలాలు చనిపోవటం కరోనా వల్లనే అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, యూపీలో మరోసారి గబ్బిలాలు గుంపు గుంపుగా చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి ఉన్నాయి. 
 
అసలే కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఘోరఖ్‌పూర్ బేల్‌ఘాట్ గ్రామంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చి పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఇది కరోనా వల్లనే జరిగిందని చెప్పుకుంటున్నారు. 
 
ఈ సమాచారం వెటర్నరీ డాక్టర్లకు తెలియటంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదనీ ఈ ప్రాంతంలో ఎండలు బాగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతోనే గబ్బిలాలు మరణించాయని తెలిపారు.  
 
అటవీ రేంజర్ మాట్లాడుతూ..ఉష్ణోగ్రత పెరగడం..గబ్బిలాలు చనిపోయిన ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని దీంతో గబ్బిలాలు చనిపోయాయని స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. మరణించిన గబ్బిలాలను తదుపరి టెస్టు కోసం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments