ప్రొఫెసర్ వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోరా? కాలేజీలో నిప్పంటించుకున్న యువతి (Video)

సెల్వి
సోమవారం, 14 జులై 2025 (13:20 IST)
colleges student
మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలేజీలో పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. కాలేజే ప్రొఫెసర్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని కాలేజీలోనే నిప్పంటుకుంది. ఈ ఘటన కలకలం రేపింది. 
 
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు షాక్‌ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒక స్టూడెంట్‌కు కూడా మంటలంటుకున్నాయి. ఇద్దరిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించారు. 
 
కాగా, ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్‌ చేశారు. 
 
ప్రొఫెసర్ వేధిస్తున్నాడని ఎంత చెప్పినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో బాధితురాలు మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. అయితే ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడంతో తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం