Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: దళిత వ్యక్తిని ఉరివేసిన గ్రామస్థులు!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:48 IST)
వివాహేతర సంబంధం నెరపిన కారణంగా ఓ దళిత వ్యక్తిని గ్రామస్థులు ఉరివేశారు. వివాహిత మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడనే కారణంతో బులంద్ షహర్‌లో గ్రామ పంచాయతీ కఠిన శిక్ష విధించింది. 
 
ఈ ఘటనలో సదరు వ్యక్తి మృత్యువాత పడగా, ఉరేసిన పంచాయతీ పెద్దలు తమకేమీ తెలియనట్లు కిమ్మనకుండా ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ఘటనపై తమకేమీ ఫిర్యాదు రాలేదని చెప్పారు. 
 
బులంద్ షహర్ జిల్లాలోని నాగ్లా తోటా గ్రామంలో లాలా అనే దళితుడు, గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. సదరు మహిళకు వివాహం కాకముందు నుంచే వారిద్దరి మధ్య 'సంబంధం' ఉంది. 
 
అయితే పెళ్లైన తర్వాత కూడా సదరు మహిళ, లాలాను కలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం వారిద్దరూ డెహ్రాడూన్ కు పారిపోయారు. గ్రామానికి తిరిగి వచ్చిన లాలా, బుధవారం డెహ్రాడూన్ వెళ్తుండగా, సదరు మహిళ భర్త అడ్డగించాడు.
 
అంతేగాక, గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అక్కడికి చేరిన గ్రామ పెద్దలు, గ్రామస్థుల కళ్లెదుటే లాలాను అక్కడి చెట్టుకు ఉరేశారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments