Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాద్రి ఘటన.. ట్విట్టర్‌పై యూపీ పోలీసుల హుకుం: ఫోటోలను తక్షణమే తొలగించండి..!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (09:47 IST)
ట్విట్టర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు హుకుం జారీ చేశారు. దాద్రి ఘటనకు సంబంధించి పోస్టయిన ఉద్రేకపూరిత వ్యాఖ్యానాలతో పాటు ఫోటోలను తక్షణమే తొలగించాలని యూపీ ఖాకీలు ట్విట్టర్‌కు హుకుం జారీ చేశారు. పశుమాంసం తిన్నారనే కారణంగా దాద్రికి చెందిన అక్లాక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కొన్ని వర్గాల వారు ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తూ ట్విట్టర్‌లో ఫొటోలతో పాటు ఆవేశపూరిత వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ల కారణంగా అల్లర్లు చెలరేగే ప్రమాదముందని భావిస్తున్న యూపీ పోలీసులు సదరు పోస్టులను తొలగించాల్సిందిగా ట్విట్టర్‌ను ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెను సంచనలనానికి తెర లేపింది. బాధిత కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తాయి.
 
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఈ ఘటనకు రాజకీయ రంగు పులమొద్దని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments