Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (21:04 IST)
నాలుగు దశాబ్ధాల పాటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌ బి అమితాబచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జవ్‌దేకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

అమితాబచ్చన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తరాల ప్రేక్షకులను అలరించిన అమితాబ్‌ను దాదా సాహెబ్‌ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకాశ్‌ జవ్‌దేకర్‌ తెలిపారు. యావత్ భారత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అమితాబ్‌ను అభిమానించే వారికందరికీ ఎంతో సంతోషకర విషయమని మంత్రి ప్రకాశ్‌ జవ్‌దేకర్‌ ట్వీట్‌ చేశారు.
 
తాను పోషించిన పాత్రలతో యాంగ్రీ యంగ్‌ మాన్‌గా ప్రసిద్ధిగాంచిన అమితాబ్‌ అనేక విలక్షణ పాత్రలను పోషించారు. 1970లో విడుదలైన జంజీర్‌, దీవార్‌ సినిమాలతో ప్రఖ్యాతి గాంచిన అమితాబ్‌ వెనుదిరిగి చూడలేదు.

1970, 1980లలో అమితాబ్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఉత్తమ నటుడుగా నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుపొందారు. నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్‌ యాంకర్‌గా అమితాబ్‌ తన ప్రతిభను చాటుకున్నారు.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్‌ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్‌తోను, 2015లో పద్మ విభూషన్‌తోనూ గౌరవించింది.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments