Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భీతిగా అవినీతి... శిక్షపడుతుందనే భయం కూడా లేదు : జస్టీస్ అమితవ్ రాయ్

జయలలిత అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు జస్టీస్ అమితవ్ రాయ్ తీర్పు సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పును చ

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (08:27 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు జస్టీస్ అమితవ్ రాయ్ తీర్పు సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పును చదువుతూ... అవినీతి అంటురోగం జన జీవనంలో ప్రతి చోటా ప్రబలుతోందన్నారు.
 
'శిక్ష పడుతుందనే భయం కూడాలేని లెక్కలేనితనం పెరిగిపోతోంది. లాభదాయక ప్రతిఫలాలను ఆశిస్తూ... సామాజిక భావజాలంపై పట్టుసాధిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న ఈ బహిరంగ అవినీతిని ప్రజా బాహుళ్యం నుంచి తరిమికొట్టేందుకు అన్ని దశల్లో వ్యక్తిగతంగా, సమిష్టిగా జోక్యం చేసుకోవటం అనివార్యం' అని జస్టిస్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. 
 
'అక్రమ మార్గాల ద్వారా సంపద పోగేసుకోవాలనుకునే దురాశపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరుల్లో అపరాధ భావం కూడా కనిపించడంలేదని, శిక్ష పడుతుందనే భయం కానరావటం లేదని తెలిపారు. సమాజంలో ఇలాంటివారిదే పైచేయి అవుతుండటంతో నిజాయితీపరులు దిక్కుతోచని వారవుతున్నారని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments