Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌గా మోత్కుపల్లి-తమిళనాడు గవర్నర్‌గా శంకరమూర్తి?

తమిళనాట రాజకీయ మార్పులు వేగవంతమైనాయి. ఓ వైపు మఖ్యమంత్రి మరణం, అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు, ఆపై ఐటీ దాడులు, ప్రభుత్వ కార్యదర్శికి గుండెపోటు వంటి అనేక పరిణామాలు తమిళనాట చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (12:39 IST)
తమిళనాట రాజకీయ మార్పులు వేగవంతమైనాయి. ఓ వైపు మఖ్యమంత్రి మరణం, అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు, ఆపై ఐటీ దాడులు, ప్రభుత్వ కార్యదర్శికి గుండెపోటు వంటి అనేక పరిణామాలు తమిళనాట చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటకకు చెందిన శంకర్‌మూర్తిని నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం.
 
శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ఈ నెల 30న ఢిల్లీకి తిరిగి రానున్నారు. ఆ లోగానే శంకరమూర్తి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. శంకర్‌మూర్తి నియామకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న రోశయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత శంకర్‌మూర్తిని నియమించాలని భావించారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యం  కాలేదు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును తాత్కాలిక గవర్నర్‌గా నియమించారు. అలాగే గవర్నర్ల నియామకాలను నిలిపివేసిన కేంద్రం ప్రస్తుతం గవర్నర్ల నియామకంపై దృష్టి పెట్టింది.
 
ఇందులో భాగంగా కొత్త గవర్నర్ల నియామకాలు మొదలుపెడితే తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నర్సింహులుకు కూడా ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ నేత శంకరమూర్తి నియామకంతో పాటు మోత్కుపల్లి గవర్నర్ నియామకం కూడా ఒకేసారి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరో రెండు రోజుల్లో తమిళనాడు గవర్నర్‌గా శంకరమూర్తి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. శంకరమూర్తితో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొత్త గవర్నర్ల నియామక పైల్‌పై రాష్ట్రపతి సంతకం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments