తీవ్ర తుఫానుగా బిపర్ జోయ్.. 145 కిలోమీటర్ల వేగంతో గాలులు

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (11:46 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది.
 
తుఫాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుఫాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. 
 
మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్‌లోని తిథాల్ బీచ్‌ను ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 
 
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని, సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments