Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిండు.. కట్నం అడిగిండు.. అరెస్టయ్యిండు..

అత్యాచారానికి పాల్పడి పంచాయితీ పెద్దలు జరిమానా విధిస్తే కట్టేసే వాళ్లను చూశాం. అమ్మాయి జీవితం బలైపోయింది. మెడలో తాళి కట్టి బుద్ధిగా కాపురం చేసుకో అంటే ఒప్పేసుకునే వాళ్లను చూశాం. కానీ అత్యాచారం చేసి కూడా పెళ్లి చేసుకోవాలంటే అయిదు లక్షల రూపాయల కట్నం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (05:38 IST)
అత్యాచారానికి పాల్పడి పంచాయితీ పెద్దలు జరిమానా విధిస్తే కట్టేసే వాళ్లను చూశాం.  అమ్మాయి జీవితం బలైపోయింది. మెడలో తాళి కట్టి బుద్ధిగా కాపురం చేసుకో అంటే ఒప్పేసుకునే వాళ్లను చూశాం. కానీ అత్యాచారం చేసి కూడా పెళ్లి చేసుకోవాలంటే  అయిదు లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసి పెళ్ళిని ఆపేసిన ప్రబుద్ధుడు క్రిమినల్స్‌లో క్రిమినల్‌గా నిలబడ్డాడు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా గ్రామానికి చెందిన తాజ్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామపెద్దలను ఆశ్రయించారు.వారు నిందితుడిని పిలిపించి కేసులేమీ పెట్టబోమని అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తీర్మానించారు. 
 
తాజ్‌ అందుకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని తీరా పెళ్లి తేదీ దగ్గరపడుతున్న సమయంలో రూ.5 లక్షలు కట్నం కావాలని అన్నాడు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో తాజ్‌ పెళ్లి ఆపేశాడు. చేసేదేంలేక నిస్సహాయులైన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు తాజ్‌పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్‌ చేశారు. మంచి కంటే చెడు ఎక్కువగా పాకిపోయే రోజులు కాబట్టి ఇతగాడు ఇకపై అత్యాచారాలు చేసేవాళ్లందరికీ ఆదర్శమూర్తి అయిపోవచ్చు. రేప్ చేసి పెళ్లాడాలంటే కట్నం ఇవ్వాల్సిందే అని తిరగబడే ఆదర్శమూర్తులన్నమాట.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments