Webdunia - Bharat's app for daily news and videos

Install App

480 మంది చర్చి ఫాదర్లపై కేసు.. ఎందుకంటే..?

Webdunia
గురువారం, 6 మే 2021 (17:17 IST)
ఒకరిద్దరిపై కాకుండా.. ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ)లో గత నెలలో చర్చి ఫాదర్ల వార్షిక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఫాదర్లపై కేసు నమోదు చేశారు.
 
ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశానికి ఆయా ప్రాంతాల నుంచి 480 మంది ఫాదర్లు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకు సుమారు 100 మందికి పైగా ఫాదర్లు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు ఫాదర్లు మరణించారు.
 
దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి చర్చి ఫాదర్లు సమావేశం నిర్వహించారని, ఆ సమయంలోనే కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు భావించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఇక కరోనా బారిన పడ్డ ఫాదర్లు చర్చి ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొందరేమో హోం ఐసోలేషన్‌కే పరిమితం అయ్యారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments