Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క రాష్ట్రంలోని కరోనా ప్రళయం : టీకాలు వేయించుకోండి.. ప్లీజ్ : కేంద్రం

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:56 IST)
దేశంలోని మొత్తం క్రియాశీల క‌రోనా కేసుల్లో 58 శాతం ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్‌ వెల్లడించారు. ఇక మొత్తం మ‌ర‌ణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే ప‌రిమితమైన‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
పంజాబ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో న‌మోద‌వుతున్న మ‌ర‌ణాలు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ట్లు కూడా రాజేష్ భూష‌ణ్ తెలిపారు. క‌రోనా కేసులు అధికంగా ఉన్న ప‌ది జిల్లాల్లో ఏడు మ‌హారాష్ట్ర‌లో ఉండ‌గా.. క‌ర్ణాట‌క‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీల‌లో ఒక్కో జిల్లా ఉన్నాయ‌ని చెప్పారు.
 
ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్య‌ను పెంచాల్సిందిగా తాము రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించామ‌ని రాజేష్ భూష‌ణ్ స్ప‌ష్టం చేశారు. మ‌హారాష్ట్ర‌లో గ‌త కొన్ని వారాలుగా ఈ ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని చెప్పారు. రాష్ట్రాలు క‌నీసం 70 శాతానికిపైగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులే చేయాల‌ని ఆయ‌న సూచించారు.
 
మరోవైపు, 45 ఏళ్లు దాటిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు కోవిడ్ టీకా తీసుకోవాల‌ని మంగళవారం కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను అభ్య‌ర్థించింది. కోవిడ్‌19 ఉధృతిని అడ్డుకోవాలంటే స‌మ‌వ‌ర్థ‌వంతంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాగాల‌ని కేంద్రం అభిప్రాయ‌ప‌డింది. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటించాల‌ని కూడా కేంద్రం త‌న సూచ‌న‌ల్లో స్ప‌ష్టం చేసింది. 
 
మాస్క్‌లు ధ‌రించ‌డం, చేతుల్ని శుభ్రం చేసుకోవ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌ని కోరింది. సిబ్బంది వ్య‌వ‌హారాల శాఖ ఇవాళ త‌న ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం 45 ఏళ్లు దాటిన వారు కోవిడ్ టీకాను తీసుకోవ‌చ్చు అని, కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ‌శాఖల‌ ఉద్యోగులు టీకా తీసుకోవాల‌ని ఆ దేశాల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments