Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కానీ జంట సహజీవనం చేయొచ్చు.. ఇండో-పాక్ జంటపై హైకోర్టు సంచలన తీర్పు

ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలిసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా పెళ్లి కానీ జంట సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌‌లోని పాకిస్థాన్ స

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (10:22 IST)
ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలిసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా పెళ్లి కానీ జంట సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌‌లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరాకు చెందిన ముస్లిం యువకుడు (20), అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి (19) ప్రేమించుకున్నారు. స్కూల్ మేట్స్ కారణంగా కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. 
 
గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. అబ్బాయి మైనర్‌ కావడంతో పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ కలసి ఉన్నప్పుడు.. గత సెప్టెంబర్‌‌లో ఆ యువతి బంధువులు అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ముస్లిం యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌ కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా.. తాను ఆ యువకుడితో ఉంటానని కోర్టుకి తెలిపింది.
 
వాదనలు విన్న జడ్జిలు, ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేమని.. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేమని చెప్పి.. తనకు ఇష్టమైతే ‌20 ఏళ్ల యువకుడితో కలిసే ఉండొచ్చు అని తీర్పు చెప్పారు. అయితే.. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా యువకుడితో  అఫిడవిట్‌ దాఖలు చేయించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments