Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో భర్త మృతి-వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన వివాహిత

Webdunia
బుధవారం, 21 జులై 2021 (18:25 IST)
తన భర్త వీర్యం తనకు కావాలని ఓ వివాహిత హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం తక్షణమే అందుకు అంగీకరిస్తూ తీర్పు వెలువరించింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గతేడాది అక్టోబర్లో ఓ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే.. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడ్డాడు. 
 
వడోదరాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తూ వస్తోంది. అతని శరీర అవయవాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. అతడు బతికేందుకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో సుస్థిరం చేసుకోవాలని ఆశించింది ఆ యువతి.. భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో తల్లి కావాలని భావించింది. 
 
అయితే.. కొవిడ్తో బాధితుడైన సదరు వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. న్యాయస్థానం ఆదేశిస్తేనే తాము అతడి వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దాంతో ఆ మహిళ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ అశుతోష్ జే శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం.. సదరు కోవిడ్ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా భద్రపరచాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments