Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను టీ అడిగితే.. భర్తను కట్టేసి కొట్టింది..

Webdunia
గురువారం, 7 మే 2020 (10:32 IST)
Tea
లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా కుటుంబమంతా ఒకే చోట వున్న సందర్భాలు ఫాస్ట్ యుగంలో తక్కువే. కరోనా కారణంగా ప్రస్తుతం అలాంటి సందర్భం తిరిగివచ్చింది. అయితే ఆ సందర్భాన్ని కొందరు సద్వినియోగం చేసుకోకుండా మహిళలను హింసించడం చేస్తున్నారు. ఈ క్రమంలో గృహహింస పెరిగిపోయిందనే రిపోర్ట్ వచ్చింది. 
 
అలాగే కొందరు మహిళలు కూడా భర్తలు వాగ్వివాదాలకు దిగడంతో కుటుంబంలో వివాదాలు మొదలవుతున్నాయి. దీంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న చాలా గృహాల్లో జగడాలు చోటుచేసుకుంటున్నాయి. అలా ఓ చిన్న వివాదం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. 
 
వివరాల్లోకి వెళితే.. టీ తయారు చేసేవిషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఉదంతంలో భార్య, ఆమె సోదరుడితో సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇన్‌ఛార్జి మహ్మద్ అస్లాం తెలిపారు. 
 
భర్త టీ పెట్టమని భార్యను కోరాడు. దీంతో ఆమె తాను టీ పెట్టలేనని, భర్తనే పెట్టుకోమని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపధ్యంలో ఆ మహిళ తన సోదరుడిని పిలిచి, మరో ఇద్దరి సాయంతో భర్తను కట్టేసి కొట్టింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగువారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వారి బారి నుంచి విడిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments