Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (10:11 IST)
ఇండియన్ ఆర్మీ గద్దలకు శిక్షణ ఇస్తుంది. గద్దలకు శిక్షణ ఏంటి అనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ సరిహద్దులకు ఆవల నుంచి భారత గగనతలంలోకి డ్రోన్సు చొరబడుతున్నాయి. ఈ బెడద ఇటీవలి కాలంలో ఎక్కువైంది. తాజాగా కూడా మాదకద్రవ్యాలతో వచ్చిన ఓ డ్రోన్‌ను కూడా భద్రతా బలగాలు గుర్తించి కూల్చివేశాయి. 
 
అయితే, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చివేశాలా ఇండియన్ ఆర్మీ గద్దలకు శిక్షణ ఇస్తుంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకునేలా వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. డ్రోన్లను కట్టడి చేసేందుకు వీలుగా గద్దలను ప్రయోగించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 
 
భారత్ అమెరికా దేశాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలైన యుద్ధ్ అభ్యాస్‌లో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు. ఓ డ్రోన్‌ను ఆర్మీ సిబ్బందిగాల్లో ఎగురవేయగా దాన్ని ఆర్మీకే చెందిన ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
ఆ వెంటనే మరో సిబ్బంది తన వద్ద ఉన్న శిక్షణ పొందిన గద్దను డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్‌ను గుర్తించి విజయవతంగా నేలకూల్చింది. ఆ గద్ద పేరు అర్జున్. డ్రోన్లను గుర్తించడంతో గద్దలకే కాదు శునకాలకు సైతం భారత్ సైన్యం శిక్షణ ఇవ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments