Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్ఎల్‌వీ-ఎఫ్09 ప్రయోగం... మధ్యాహ్నం 1.57 గంటలకు కౌంట్‌డౌన్ స్టార్ట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం 1.57 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా 27 గంటలు కొనసాగ

Webdunia
గురువారం, 4 మే 2017 (10:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం 1.57 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా 27 గంటలు కొనసాగిన అనంతరం శుక్రవారం జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ శాటిలైట్‌కు సౌత్ ఆసియా శాటిలైట్ అనే నామకరణం చేసిన విషయం తెల్సిందే. పాకిస్థాన్ మినహా ఇతర సౌత్ ఆసియా దేశాలకు ఉపయోగపడేలా ఈ శాటిలైట్‌ను భారత్ సొంత ఖర్చు (సుమారు రూ.235 కోట్లు)తో తయారు చేసి ప్రయోగించనుంది. దీని సేవలు ఒక్క సేవలు మినహా ఇతర్ దక్షిణాసియా దేశాలు ఉచితంగా పొందనున్నాయి. 
 
కాగా, ఈ శాటిలైట్ ప్రయోగానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కాబోతోంది. దీనికి సంబంధించిన రాకెట్‌ సన్నద్ధత సమావేశం బుధవారం షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. ఇందులో రాకెట్‌ అనుసంధానం, కౌంట్‌డౌన్‌ ప్రక్రియ, వివిధ పరీక్షల నిర్వహణ, తదితరాలపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కల్పనా కాన్ఫరెన్సు హాలులో లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశం (ల్యాబ్‌) ప్రారంభమైంది. 
 
ఇందులో రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌-9 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్‌ కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ఇస్రోలోని అన్ని విభాగాల సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని రాకెట్‌ ప్రయోగంలో నిమగ్నమయ్యారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments