Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి ఉగ్రరూపం- 24 గంటల్లో 100మంది మృతి

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (10:20 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కోవిడ్‌ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 4వేల కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,649కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 81,970కి చేరింది.

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,920 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,401 మంది చికిత్స పొందుతున్నారు. వలస కూలీలు సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం మరింత కలవర పెడుతోంది.
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా మరణించినట్టు వరల్డ్ మీటర్ పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం 4,521,260 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

303,071 మంది మరణించారు. 1,702,124 మంది కోలుకున్నారు. అమెరికా, స్పెయిన్, యూకే ఈ వైరస్ దాటికి గడగడలాడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 95,605 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తించారు. 5,306 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments