Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో 49,310 కేసులు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:40 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా సోకి 740 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 30,061 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు 63.18శాతంగా ఉంది. దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 41లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments