Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టుకి కరోనావైరస్? ఎదురు చూస్తున్న పోలీసులు

Webdunia
సోమవారం, 10 మే 2021 (18:41 IST)
మావోయిస్టులపై సైతం కరోనా ఎఫెక్ట్‌ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల రాక కొసం పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మావోలకు కరోనా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
 
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజన్ పరిధిలో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో సుమారు 70 నుంచి100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌లు ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments