Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేద నిలయానికి ఐదుగురు కానిస్టేబుళ్ళతో భద్రత... చిన్నబోయిన శశికళ!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో షాడో సీఎంగా ఉన్న మహిళ శశికళ. తెరవెనుక చక్రం తిప్పుతూ వచ్చారు. కానీ, జయలలిత మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయలలిత నివాస ప్రాంతమైన పోయస్ గార్డ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (12:20 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో షాడో సీఎంగా ఉన్న మహిళ శశికళ. తెరవెనుక చక్రం తిప్పుతూ వచ్చారు. కానీ, జయలలిత మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయలలిత నివాస ప్రాంతమైన పోయస్ గార్డెన్‌లోని భద్రతను పూర్తిగా తొలగించారు. ఇపుడు కేవలం ఐదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రతగా ఉన్నారు. వాస్తవానికి గత పదేళ్లుగా ఇక్కడ పదుల సంఖ్యలో కానిస్టేబుళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్.పి.జి) కమాండోలు భద్రతా ఉండేవారు. 
 
కానీ, జయలలిత మరణం తరువాత తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికారాన్ని దక్కించుకోవాలని జయ నెచ్చెలి శశికళ ప్రయత్నాలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎక్కడికక్కడ విజయవంతంగా అడ్డుకుంటున్నారు. ఆమె వర్గంలోని వారికి ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళకు హై సెక్యూరిటీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జయలలిత బతికున్నప్పటి నుంచి ఆమెతో పాటు శశికళకూ అత్యున్నత స్థాయి పోలీసు భద్రతను కల్పిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. 
 
సోమవారం వరకూ ఈ భద్రత కొనసాగగా, దీన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ కాగానే, పోయిస్ గార్డెన్స్‌లోని వేదనిలయం నుంచి 80 శాతం భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కానిస్టేబుళ్లతో మాత్రమే సెక్యూరిటీ కొనసాగుతోంది. దీంతో శశికళ ప్రైవేట్ సెక్యూరిటీని భద్రతగా నియమించుకున్నారు. ఇక శశికళను సందర్శిస్తున్న నేతల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది. నిన్నమొన్నటి వరకూ పార్టీకి చిన్నమ్మే దిక్కని మోకరిల్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జరుగుతున్న పరిణామాలు శశికళ ఆధిపత్యానికి చెక్ చెప్పనున్నాయని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments