Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 6న నిత్యానందకు పురుషత్వ పరీక్ష : వారెంట్ జారీ!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (16:13 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు కర్ణాటక రాష్ట్రంలోని రామనాడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై దాఖలైన కేసుల్లో ఓ కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. ఇదిలావుండగా, ఆగస్టు ఆరో తేదీన నిత్యానందను అదుపులోకి తీసుకుని పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. 
 
సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు. దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. 
 
కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు పురుషత్వ పరీక్షలపై స్టే విధించింది. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం నిత్యానందపై ఉన్న అన్ని కేసులను విచారించిన హైకోర్టు స్టేను ఎత్తి వేసింది. వెంటనే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?