మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ... మెట్రో రైల్ ఎక్కేందుకు అనుమతించలేదు!!!

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (19:19 IST)
మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ ఓ యువకుడిని మెట్రో రైల్ ఎక్కేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ ఘటన బెంగుళూరులోని దొడ్డకళ్ళసంద్ర మెట్రో స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. షర్టు బటన్‌ వేసుకుని శుభ్రమైన దుస్తులతో రావాలని, లేకుంటే స్టేషన్‌లోకి వెళ్లనివ్వబోమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) సిబ్బంది యువకుడిని కోరినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. 'మన మెట్రో ఇలా ఎప్పుడు మారింది?' అంటూ వ్యాఖ్యను జత చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
 
కాగా తాము ప్రయాణికులందరినీ సమానంగా చూస్తామని బీఎంఆర్‌సీఎల్‌ సిబ్బంది తెలిపారు. 'ప్రయాణికులు ధనవంతులా, పేదవారా, పురుషులా, మహిళలా అనే భేదం చూపం. ఆ యువకుడు తాగిన మత్తులో ఉన్నాడని అధికారులు అనుమానించారు. మెట్రోలో మహిళలు, పిల్లలు ప్రయాణిస్తుంటారు. వారి భద్రత మా బాధ్యత. అందుకే వారికి ఇబ్బంది కలగకూడదని అతడిని ఆపాము. కౌన్సిలింగ్‌ ఇచ్చాక మెట్రోలోకి అనుమతించాం' అని ఓ అధికారి తెలిపారు.
 
గతంలో కూడా ఇలాగే బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ ఒక రైతును దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రోలోకి అనుమతించలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవడంతో సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు బీఎంఆర్సీఎల్‌ సిబ్బందిపై నిరసన వ్యక్తంచేశారు. దీంతో అధికారులు మెట్రో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments