మూలాలు మరచిపోని ప్రధాని.. మోడీపై ఆజాద్ ప్రశంసల వర్షం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (18:10 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు.. ప్రధాని అయ్యాక కూడా ఆయన  మూలాలు ఎన్నడూ మర్చిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని నరేంద్ర మోడీ చాలా సార్లు చెప్పారని ఆజాద్ గుర్తుచేశారు.
 
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సభలో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూపై వ్యాఖ్యలు చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని లోపాలను ఎత్తిచూపిన ఆజాద్.. ఈ మధ్యే రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు.. ఇక, గ్రూప్ -23 నాయకులలో ఒకరైన ఆజాద్.. ఇప్పుడు ప్రధానిపై ప్రశంసలు కురిపించడం చర్చగా మారింది. 
 
విశేషమేమిటంటే, గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనను రాజ్యసభలో ప్రశంసించారు. ఆయనకు సంబంధించిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక, ఈ ప్రశంసల వెనుక మతలబు ఏంటైనా ఉందా? అనే చర్చ సాగగా... కాశ్మీర్‌లు మంచు ఎప్పుడు నల్లగా కురుస్తుందో అప్పుడు నేను బీజేపీలో చేరతానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments