Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక సమరం కోసం కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా - రాహుల్ సాహసం...

ఠాగూర్
శుక్రవారం, 8 మార్చి 2024 (20:20 IST)
సార్వత్రిక సమరం కోసం కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 39 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాధీ మరోమారు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న విషయం తెల్సిందే. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్‌ - సురేశ్‌ కుమార్‌ షేట్కర్‌, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ - చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో ఉన్న 39 మందిలో 15 మంది జనరల్‌..  24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు.
 
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ గురువారం ఢిల్లీలో సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, అధీర్‌రంజన్‌ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్‌, టీఎం సింగ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు.
 
ఛత్తీస్‌గఢ్‌
జంజ్‌గిర్‌-చంపా (ఎస్సీ) -డా.శివకుమార్‌ దహారియా
కోర్బా - జ్యోత్స్న మహంత్‌
రాజ్‌నందగావ్‌ - భూపేశ్‌బఘేల్‌
దుర్గ్‌ - రాజేంద్ర సాహూ
రాయ్‌పూర్‌ - వికాస్‌ ఉపాధ్యాయ్‌
మహాసముంద్‌ - తమ్రధ్వజ్‌ సాహూ
 
కర్ణాటక
బిజాపూర్‌ (ఎస్సీ) - హెచ్‌.ఆర్‌.అల్గుర్‌ (రాజు)
హవేరి - ఆనందస్వామి
శివమొగ్గ - గీతా శివరాజ్‌కుమార్‌
హసన్‌ - శ్రేయస్‌ పటేల్‌
తుమకూరు - ఎస్‌.పి.ముద్ద హనుమెగౌడ
మండ్య - వెంకటరామెగౌడ (స్టార్‌ చంద్రు)
బెంగళూరు (రూరల్‌) - డీకే సురేష్‌
 
కేరళ
కాసర్‌గోడ్‌ - రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌
కన్నూరు - కె. సుధాకరన్‌
వడకర - షఫీ పరంబిల్‌
వయనాడ్‌ - రాహుల్‌ గాంధీ
కోలికోడ్‌ - ఎం.కె. రాఘవన్‌
పాలక్కడ్‌ - వీకే శ్రీకందన్‌
అలతూర్‌ (ఎస్సీ) - రమ్య హరిదాస్‌
త్రిశ్శూరు - కె.మురళీధరన్‌
చలకుడి - బెన్నీ బెహనన్‌
ఎర్నాకుళం - హిబి ఇడెన్‌
ఇడుక్కి - డీన్‌ కురియాకోసె
అళప్పుజ - కేసీ వేణుగోపాల్‌
మావెలిక్కర (ఎస్సీ) - కోడికున్నిల్‌ సురేష్‌
పతనంథిట్ట - ఆంటో ఆంటోనీ
అట్టింగల్‌ - అదూర్‌ ప్రకాశ్‌
తిరువనంతపురం - డా. శశిథరూర్‌
 
లక్షద్వీప్‌
లక్షద్వీప్‌ (ఎస్టీ) - మహ్మద్‌ హమ్‌దుల్లా సయీద్‌
 
మేఘాలయా
షిల్లాంగ్‌ (ఎస్టీ) - విన్సెంట్‌ హెచ్‌. పాల
తురా (ఎస్టీ) - సాలెంగ్‌ ఎ.సంగ్మ
 
నాగాలాండ్‌
నాగాలాండ్‌ - ఎస్‌.సుపోంగమెరెన్‌ జమీర్‌
 
సిక్కిం
సిక్కిం- గోపాల్‌ ఛెత్రి
 
తెలంగాణ
జహీరాబాద్‌ - సురేష్‌ కుమార్‌ షెట్కర్‌
నల్గొండ - రఘువీర్‌ కుందూరు
మహబూబ్‌నగర్‌ - చల్లా వంశీచంద్‌ రెడ్డి
మహబూబాబాద్‌ (ఎస్టీ) - బలరాం నాయక్‌
 
త్రిపుర
త్రిపుర వెస్ట్‌ - ఆశిష్‌ కుమార్‌ సాహా 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments