Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వెల్లడి.. పాతకాపులకు పెద్దపీట

Webdunia
శనివారం, 28 మే 2016 (17:21 IST)
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇందులో పాతకాపులకు పెద్దపీట వేసింది. మొత్తం ఎనిమిది మంది పేర్లతో ఈ జాబితాను విడుదల చేయగా ఇందులో పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.
 
వీరిలో పి.చిదంబరం, అంబికా సోని, కపిల్ సిబల్, ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేష్, ప్రదీప్ టమ్టా, వివేక్ టంఖా, ఛాయావర్మలు ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర నుంచి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఉత్తరప్రదేశ్ నుంచి సీనియర్ నేతలు కపిల్ సిబల్, కర్ణాటక నుంచి ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేష్, పంజాబ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ, ఉత్తరాఖండ్ నుంచి ప్రదీప్ టమ్టా, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ టంఖా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఛాయావర్మలు రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది.
 
కాగా, క్రితంసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేష్‌ను ఈ దఫా కర్ణాటక నుంచి పంపించనున్నారు. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు విముఖత చూపిన చిదంబరంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరుణ చూపి.. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించడం ఢిల్లీలో చిదంబరంకు ఉన్న పలుకుబడిగా చెప్పుకోవచ్చు. రాజ్యసభలో ప్రధాని మోడీ సర్కారును ఎండగట్టేందుకే పార్టీ దిగ్గజాలను రాజ్యసభకు నామినేట్ చేసినట్టుగా ఉంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments