Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (14:37 IST)
సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు రోడ్లెక్కారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో హింసాకాండ, ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పేరుతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా యువకుల ఆందోళనలకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సత్యాగ్రహ దీక్షను మొదలుపెట్టింది. 
 
ఇందులో ప్రియాంకా గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు పెట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యంలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటీష్ పాలకుల పోలీసులు,స లాఠీలు బ్యారికేడ్రను గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని గుర్తుచేశారు. ఇపుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా అని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments