Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకు చిత్తుగా ఓడిపోనున్న బీజేపీ!?

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (17:44 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార భారతీయ జనత పార్టీ చిత్తుగా ఓడిపోతుందని హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేసే ఎస్.ఏ.ఎస్ గ్రూపు సర్వే వెల్లడించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఏకంగా 114 సీట్లను కైవసం చేసుకుంటుందని, బీజేపీకి మాత్రం 65 -75 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ మాత్రం 24 నుంచి 34 సీట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది.
 
ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీకి 38.14శాతం నుంచి 40 శాతానికి పెరుగుతుందని, బీజేపీ ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతాయని, జేడీఎస్ కూడా 1.3 శాతం మేరకు ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల మద్దతు ఎక్కువగా ఉందని తెలిపింది. అయితే, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ  రాయచూరు, కోలార్, బళ్లారి, గంగావతి, కొప్పల్, దావణగెరే నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments