అమితాబ్ - సల్మాన్‌లతో దిగిన ఫోటోలు చూపి.. మోడల్‌ను రేప్ చేసిన నటుడు
బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌లతో దిగిన పోటోలు చూపించి సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మోడల్‌ను నమ్మించి ఆమెపై ఓ నటుడు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ
బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌లతో దిగిన పోటోలు చూపించి సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మోడల్‌ను నమ్మించి ఆమెపై ఓ నటుడు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలను పరిశీలిస్తే...
ముంబైకు చెందిన స్వరాజ్ సింగ్ అనే ఓ నటుడు ఇండస్ట్రీలో తనకు ఎంతోమంది దర్శక, నిర్మాతలు, హీరోలు పరిచయాలు ఉన్నాయని ముంబైకు చెందిన ఓ మోడల్‌ను నమ్మించాడు. పైగా, అమితాబ్, సల్మాన్, ఇతర బాలీవుడ్ హీరోలతో ఉన్న ఉన్న ఫోటోలు చూపించాడు. ఇండస్ట్రీలో పెద్దలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న మోడల్ అతన్ని గుడ్డిగా నమ్మింది.
ఆ తర్వాత అతని వెంట ఆఫీసుకు వెళ్లగా, ఆ మోడల్‌కు మత్తు కలిపిన శీతలపానీయాన్ని ఇచ్చి రేప్ చేశాడు. ఆ తర్వాత స్మృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నటుడి రంగు బయటపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు.