Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

ఠాగూర్
బుధవారం, 6 ఆగస్టు 2025 (09:31 IST)
దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జలప్రళయం సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మికంగా భారీ వరద సంభవించింది. ఈ వరద నీటి ప్రవాహంలో ఏకంగా ఒక గ్రామమే కొట్టుకునిపోయింది. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు సమాచారం. వీరికోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. 
 
వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉండటం గమనార్హం. హర్షిల్ ఆర్మీ క్యాంపస్‌కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు సమాచారం. వారికోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ధరాలీ గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది.
 
150 మంది సభ్యుల బృందం, ఎన్డీఆర్ఎఫ్‌తో కలిసి సహాయక చర్యలు చేపడుతోంది. ఒకవైపు తమ బృంద సభ్యులు గల్లంతైనప్పటికీ, నిరాటంకంగా సహాయక కార్యక్రమాలు సైన్యం కొనసాగిస్తోంది. అయితే ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం