స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 21 నవంబరు 2025 (11:30 IST)
Girl
స్కూలుకు లేటుగా వచ్చిందనే కారణంతో టీచర్ విద్యార్థిని బలవంతంగా వంద గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఈ నెల 8వ తేదీన స్కూలుకు లేటుగా వెళ్లిన ఆరో తరగతి బాలికను స్కూల్ టీచర్‌ 100 గుంజీలు తీయాలంటూ బలవంతం చేసింది. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలిక.. గుంజీలు తీయడంతో అస్వస్థతకు గురైంది. 
 
వెంటనే ఆస్పత్రికి టీచర్లు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బ్యాగుతో పాటు గుంజీలు తీయడంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి ఆరోపించింది. బ్యాగుతో పాటే గుంజీలు తీయమని టీచర్ బలవంతం చేసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments